రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న సందీప్ అనే వ్యక్తిని కారు ఢీకొట్టడంతో ఆయనకు కాలుకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వ్యక్తిని 108వాహనంలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.