ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
NTR: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నందిగామ మండలం మాగల్లులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నందిగామ ఇన్‌ఛార్జ్ మొండితోక జగన్మోహన్ రావు జగ్గయ్యపేట ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన విశిష్టతను వివరించారు.