బూరుగడ్డ చెరువులో చేప పిల్లల పంపిణీ
SRPT: బూరుగడ్డ గ్రామ పరిధిలోని చెరువు లో ఈరోజు చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో అందించిన రెండు లక్షల చేప పిల్లలను వదిలే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గూడెపు శ్రీను, బూరుగడ్డ PACS ఛైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అరుణ్ కుమార్ దేశ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు.