VIDEO: ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసు బందోబస్తు

VIDEO: ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసు బందోబస్తు

RR: ఇబ్రహీంపట్నం పురపాలిక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ఇవాళ జరుగుతున్న నేపథ్యంలో 163 BNSS యాక్ట్‌ను అమలు చేశారు. అక్కడ 400 మంది పోలీసులతో భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నిక మధ్యాహ్నం 12.30 గంటలకు జరగనుంది. గతంలో ఛైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నిక జరిగినప్పటికీ కోర్టు స్టే ఇవ్వడంతో అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఎన్నిక వాయిదా పడింది.