రాజీనామా డిమాండ్‌పై అజిత్ పవార్ స్పందన
భూ వివాదం నేపథ్యంలో తన పదవిని రాజీనామా చేయాలని డిమాండ్లు పెరుగుతున్న వేళ మహారాష్ట్ర DY CM అజిత్ పవార్ స్పందించారు. తన మనస్సాక్షి ప్రకారం నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఆయన కుమారుడు పార్థ్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ రూ.1800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రూ.300 కోట్లకు దక్కించుకుంది. దీనిపై విమర్శలు రావడంతో భూ కొనుగోలు ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.