తిరువూరును కమ్మేసిన మంచు దుప్పటి
NTR: తిరువూరు ప్రాంతాన్ని సోమవారం ఉదయం దట్టమైన మంచు దుప్పటి కమ్మేసింది. దాదాపు 50-100 మీటర్లకే విజిబిలిటీ తగ్గిపోవడంతో జాతీయ రహదారిపై వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని జాగ్రత్తగా ప్రయాణించారు. తెల్లవారుజామున చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా వేగ పరిమితి పాటించాలని అధికారులు సూచించారు.