నిధులు లేక ఆగిన శిల్పారామం నిర్మాణం
SDPT: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోమటి చెరువు వద్ద రూ.20 కోట్లతో ప్రారంభించిన శిల్పారామం పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ఈ నిర్మాణానికి ప్రభుత్వం మారడంతో నిధుల విడుదల ఆగింది. కాంగ్రెస్ సర్కార్ నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.