గిద్దలూరులో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

ప్రకాశం: గిద్దలూరులోని ఓ ఒకేషనల్ కళాశాలలో ప్రజా సంకల్ప వేదిక ఆధ్వర్యంలో అవినీతి రహిత సమాజం కోసం విద్యార్థుల పాత్ర అనే అంశంపై బుధవారం వ్యాసరచనపోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ పోటీలలో 27 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరికి బహుమతులు అందజేస్తామని వేదిక ప్రతినిధులు చెప్పారు.