మందుబాబు హల్చల్.. ఆర్టీసీ బస్సుపై దాడి

మందుబాబు హల్చల్.. ఆర్టీసీ బస్సుపై దాడి

TG: మహబూబాబాద్ జిల్లాలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. కొత్తగూడ నుంచి నర్సంపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సును అడ్డుకుని.. డ్రైవర్, కండక్టర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బస్సు అద్దాన్ని ధ్వంసం చేసి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.