అక్రమ ఇసుక డంపులు సీజ్ చేసిన అధికారులు

అక్రమ ఇసుక డంపులు సీజ్ చేసిన అధికారులు

JGL: బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే స్మగ్లర్లు అక్రమ ఇసుక డంపులు ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ముంతాజ్ బుద్దీన్ బుధవారం ఇసుక డంపుల వద్దకు వెళ్లి చూడగా.. ఇసుకపై పశుగ్రాసం వేసి, ప్లాస్టిక్ కవర్ కప్పి ఇసుక కనిపించకుండా చేసిన ప్రయత్నాన్ని అధికారులు గుర్తించారు. ఇసుక డంపులు పరిశీలించి వాటిని సీజ్ చేశారు.