ఈ ఏడాది చలి తీవ్రత పెరుగుతోంది: IMD
దేశంలో ఈ ఏడాది చలి సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అలాగే 4-5 రోజులపాటు కోల్డ్ వేవ్ ప్రభావం కొనసాగుతుందని IMD తెలిపింది.