జాతీయస్థాయి కబడ్డి పోటీలకు గోదావరి ఎంపిక

NZB: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామానికి చెందిన గోదావరి రాష్ట్ర పోలీసు కబడ్డి ఉమెన్స్ జట్టుకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. ప్రస్తుతం గోదావరి నిజామాబాద్ పోలీసు డిపార్ట్మెంట్‌లో విధులు నిర్వహిస్తోంది. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారిణి ఎంపికవడంపై కబడ్డి సంఘం అధ్యక్ష కార్యదర్శులు అభినందనలు తెలిపారు.