'రైతులు త్వరగా పంట విక్రయించాలి'

'రైతులు త్వరగా పంట విక్రయించాలి'

GDWL: జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు తమ పంటను గన్ని సంచుల్లో నింపుకొని కొనుగోలు కేంద్రాలకు రావాలని జిల్లా వ్యవసాయాధికారి వీరప్ప సూచించారు. గోనె సంచుల కొరత దృష్ట్యా, రైతులు సొంతంగా బస్తాలు తెచ్చుకుంటే ఒక్కో ఖాళీ బస్తాకు రూ.15 చెల్లిస్తామన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో పంట నష్టపోకుండా రైతులు త్వరగా విక్రయించాలని కోరారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.