NSP కాలువ పరిధిలోని ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
SRPT: నడిగూడెం మండలంలోని NSP కాలువ పరిధిలో ఉన్న సిరిపురం, నారాయణపురం సహా పలు గ్రామాల ప్రజలు కాలువలో బట్టలు ఉతకడం, స్నానం చేయడం చేయకూడదని ఎస్సై అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కాలువలో నీరు నిండుగా ప్రవహిస్తుండటం వల్ల గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు.