వైభవంగా సామూహిక మంగళగౌరి వ్రతాలు

JGL: శ్రావణ మాసం వేడుకల్లో భాగంగా కోరుట్ల పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయ ఆవరణలో పద్మశాలి కులోన్నతి సంఘం ఆధ్వర్యంలో సామూహిక మంగళగౌరి వ్రతాలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళగౌరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు గుంటుక ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, మహిళలు అధిక సంఖలో పాల్గొన్నారు.