రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కోనసీమ: ముమ్మిడివరం మండలం కాశివాని తూము సెంటర్ వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి గుర్తింపు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.