VIDEO: ప్రత్తిపాడులో విధులు బహిష్కరించిన లాయర్లు
KKD: ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్యను నిరసిస్తూ ప్రత్తిపాడు బార్ అసోసియేషన్, ఐలాజ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. కోర్టు వెలుపల ధర్నా నిర్వహించి, జడ్జి గోపినాథ్‌కు వినతిపత్రం అందజేశారు. హంతకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు.