బాలల సదన్ కేంద్రాన్ని సందర్శించిన DMHO
ఖమ్మం నగరంలోని బాలల సదన్ కేంద్రాన్ని బుధవారం DMHO డాక్టర్ రామారావు సందర్శించారు. కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న సేవలు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిల్లల భద్రత, ప్రత్యేక కార్యక్రమాలపై సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి ఎదుగుదలకు కృషి చేయాలని పేర్కొన్నారు.