VIDEO: వీరులపాడులో భారీ ఈదురు గాలులతో వర్షం
NTR: వీరులపాడు మండలంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి చల్లబడిన వాతావరణం సాయంత్రానికి చిరుజల్లులతో ప్రారంభమై తీవ్ర గాలివానగా మారింది. ఇప్పటికే మొక్కజొన్న పంట కల్లాలో ఉండడంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారులు పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.