VIDEO: ఎర్రచందనం స్వాధీనం: డీఎస్పీ

CTR: పుంగనూరు మండలం నేతిగుట్టపల్లి వద్ద ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. కారులో 660 కేజీల 20 దుంగలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీటి విలువ రూ.34 లక్షలు ఉంటుందన్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.