సోయా కొనుగోలు పరిమితి పెంపు: DM

సోయా కొనుగోలు పరిమితి పెంపు: DM

KMR: సోయా కొనుగోలు పరిమితిని ప్రభుత్వం పెంచిందని KMR జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి బుధవారం ప్రకటించారు. గతంలో ఎకరానికి 7.62 క్వింటాళ్లుగా ఉన్న పరిమితిని 10 క్వింటాళ్లకు పెంచడం జరిగింది. రైతులు తమ సోయాను తేమశాతం లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, రైతుల పేరుతో దళారులు ఎవరైనా కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు జరిపితే సీజ్ చేస్తామన్నారు.