పాఠశాలలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
GDWL: జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు గురువారం మల్దకల్ మండలం, పెద్దదొడ్డి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని విద్యార్థుల నైపుణ్యాలను, వంట గదిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.