నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMM : వేంసూరు సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ గొడ్డటి అంకారావు తెలిపారు. ఉపకేంద్రంలో అత్యవసర మరమ్మతు పనుల నిమిత్తం ఇవాళ ఉదయం 9 నుంచి 1 గంటల వరకు వేంసూరు, యర్రగుంటపాడు, చౌడవరం, మర్లపాడు గ్రామాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. కావున వినియోగదారులు, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.