ప్రైవేట్ వ్యాపారుల ఇష్టారాజ్యం
KNR: చొప్పదండి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల కోసం నిర్మించిన షెడ్డుల్లో ప్రైవేట్ వ్యాపారులు తమ బస్తాలను నిల్వ చేసుకున్నారు. రైతులు షెడ్డు బయట ధాన్యం ఆరబోయడంతో వర్షానికి కాలువల్లో కొట్టుకుపోతుంది. అన్నదాతలు మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.