సబ్బులు, షాంపులతో వెరైటీ వినాయకుడు.. ఎక్కడో తెలుసా?

సబ్బులు, షాంపులతో వెరైటీ వినాయకుడు.. ఎక్కడో తెలుసా?

ATP: పామిడిలోని మంజు టాకీస్ సమీపంలో సబ్బులు, షాంపూలతో వెరైటీ వినాయకుడిని ప్రతిష్టించారు. వెరైటీ వినాయకుడు రూపొందించిన తేజ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వినాయక చవితి పండుగ రోజున వెరైటీ వినాయకుడిని తయారు చేస్తామన్నారు. ఈ ఏడాది రూ. 25,000 ఖర్చుతో షాంపూలు, సబ్బులతో వెరైటీ వినాయకుడిని తయారు చేశామన్నారు. ఈ వినాయకుడిని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.