యుద్ధంతో రష్యా లాభపడుతోంది: జెలెన్‌స్కీ
పశ్చిమాసియా యుద్ధం వల్ల రష్యా ఆర్థిక ప్రయోజనాలు పొందుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇరాన్ హర్మూజ్‌ను మూసివేయడంతో ప్రపంచ దేశాలు మళ్లీ రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. దీంతో మాస్కో తమ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని చెప్పారు. అలాగే, రష్యా తమపై దాడులను మరింత తీవ్రం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.