VIDEO: బద్వేల్ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసరుగా RDO
KDP: బద్వేల్ మున్సిపాలిటీలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసరుగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ నరసింహారెడ్డి శాలువా కప్పి సత్కరించారు. పట్టణ అభివృద్ధి మౌలిక వసతుల మెరుగుదలకు కట్టుబడి పని చేస్తానని చంద్రమోహన్ తెలిపారు.