లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
కడప: ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాడ్జీలు, డార్మిటరీలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్సై రాఘవేంద్ర రెడ్డి సిబ్బందితో కలిసి గదులు, గెస్టుల వివరాలు, రిజిస్టర్ నిర్వహణ, సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.