సిరిపెళ్లిలో అమర జవాన్లకు నివాళులు

ADB: కుబీర్ మండలం సిరిపెళ్లి (H) గ్రామంలో పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు శుక్రవారం గ్రామ యువకులు ఘనంగా నివాళులు అర్పించారు. కొవ్వొత్తులను వెలిగించి ర్యాలీ నిర్వహించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని 2 నిమిషాలు మౌనం పాటించారు.దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లు దేశ ప్రజల గుండెల్లో సజీవంగా ఉంటారని అన్నారు.