గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

MLG: ఉదయం వాకింగ్ చేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటన ఏటూరునాగారంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కంకణాల రమేష్ అనే వ్యక్తి గురువారం ఉదయం 163జాతీయ రహదారిపై వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జంపన్నవాగు 2వ బ్రిడ్జీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రమేష్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.