కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

KNR: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 నుండి 17 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ సూచనల మేరకు ముందు జాగ్రత్త చర్యగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాల నేపథ్యంలో సహాయం కోసం 0878 2997247 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలన్నారు.