తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. మూడు రోజులపాటు వర్షాలు

HYD: తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.