నేటి నుంచి సింగరేణిలో వృత్తి విద్య కోర్సుల పరీక్షలు

PDPL: వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు ఈరోజు యైటింక్లయిన్కాలనీలోని సెక్టార్ 3 సింగరేణి హైస్కూల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్జీ 2 డీజీఎం పర్సనల్ పీ. అరవింద రావు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు తప్పకుండా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే శిక్షణ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు.