స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: దామరచర్ల మండలం వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం, పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మహా క్షేత్రంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సతీసమేతంగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరిపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని అన్నారు.