చీరాల అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు

ప్రకాశం: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రతిపాదనల మేరకు ఆ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకట మురళి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జల జీవన్ మిషన్ కింద పనుల కోసం రూ.10 కోట్లు, RWS స్కీం కోసం రూ.60 లక్షలు ఇస్తామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులకు రూ.10 కోట్లు , బీచ్‌ల అభివృద్ధికి రూ.4 కోట్లలు ఇచ్చారు.