విమానాల రద్దు.. భారీగా పెరిగిన టికెట్ ధర
తిరుపతి: ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో తిరుపతి-హైదరాబాద్ విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రతి రోజు తిరుపతికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి 14 సర్వీసులు నడుస్తుండగా.. ఇప్పటికే ఆరు సర్వీసులు రద్దయ్యాయి. ఒక్క హైదరాబాద్ నుంచే 5 సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం తిరుపతి-హైదరాబాద్ విమాన టికెట్ ధర రూ. 23 వేలుగా ఉంది.