ఫుట్‌పాత్ పనులకు శంకుస్థాపన
VSP: గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో హైవే నుంచి గాంధీ బొమ్మ జంక్షన్ మీదుగా ఆటోనగర్ సెంటర్ వరకు ఇరువైపుల ఫుట్‌పాత్ పనులకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక కార్పొరేటర్ బోండా జగన్నాధం (జగన్) భూమి పూజ చేశారు. జీవీఎంసీ నిధులు సుమారు రూ.3 కోట్లు మంజూరై వడ్లపూడి నుంచి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.