ఉపాధి హామీ పనులపై కలెక్టర్‌కు ఫిర్యాదు

SKLM: ఆమదాలవలస నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ సోమవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్‌లో ఉపాధి హామీ పనులపై ఫిర్యాదు చేశారు. సుమారు 250 కోట్ల రూపాయలు విలువచేసే MGNREGS మెటీరియల్ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని కలెక్టర్‌కు తెలిపారు. ఈ పనులపై పర్యవేక్షణ చేయాలని కోరారు.