రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా కోడూరు మండలం సెట్టిగుంట రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం సుమారు 38 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. బ్రౌన్ చొక్కా, గళ్ళ లుంగీ ధరించిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వారు 9885961430 నంబరుకు సంప్రదించాలని రైల్వే అధికారులు కోరారు.