త్వరలో కొత్త పింఛన్లు: మంత్రి కొండపల్లి
VZM: అర్హత ఉన్నవారికి కొత్త పింఛన్లను త్వరలో మంజూరు చేయడానికి సీఎం చంద్రబాబు కార్యాచరణ సిద్దం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శనివారం గజపతినగరం మండలం జిన్నాం గ్రామంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో ముందురోజే పింఛన్ల పంపిణీ చేశారు.