మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు

మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు

ఖమ్మం సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గోడపత్రాన్ని బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విడుదల చేశారు. ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సునీత తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అర్హులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.