సంగమేశ్వర స్వామికి 49 గ్రాముల బంగారాన్ని బహుకరణ

NLR: సంగం పట్టణంలోని శ్రీ సంగమేశ్వర ఆలయానికి పలువురు సోమవారం బంగారాన్ని సమర్పించారు. ఈ మేరకు సంగం గ్రామానికి చెందిన దాతలు కోటు సుధాకర్ రెడ్డి, వాయుసుత దంపతులు సుమారు 5 లక్షల 60 వేల రూపాయల విలువైన 49 గ్రాముల బంగారాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రఘు రామయ్యకు దాతలు సమర్పించారు. అనంతరం దాతలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించి ప్రసాదాలను అందజేశారు.