వనపర్తి నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు

వనపర్తి నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు

WNP: అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షణకు వనపర్తి నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. 15న సాయంత్రం వనపర్తి నుంచి అరుణాచలం బస్సు బయలుదేరుతుందని 16న కాణిపాకం, వేలూరులో అమ్మవారి దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుని, 17న గిరి ప్రదక్షిణ అనంతరం బయలుదేరి 18న వనపర్తికి చేరుకుంటుందన్నారు.