పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవు: DEO
KDP: భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు,నెల్లూరు,తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కడప జిల్లాలో మండలాల వారీగా స్థానికంగా ఉన్న పరిస్థితులు, వర్షాలు ఇబ్బందులు ఆధారంగా సెలవులను మండల MEOలు ప్రకటించాలని కడప DEO షంషొద్దీన్ కొద్దిసేపటి క్రితమే సర్కులర్ జారీ చేశారు.