యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు

SDPT: రైతులకు యూరియా బస్తాలు దొరకడం పెద్ద సవాల్‌గా మారింది. ఒక్క యూరియా బస్తా కోసం కుటుంబం మొత్తం లైన్లో నిలబడాల్సి వస్తుంది. అయిన యూరియా దొరుకుతుందనే నమ్మకం లేదు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శుక్రవారం రైతు వేదిక వద్ద, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అందరికి సరిపడ యూరియా పంపిణి చేయాలనీ రైతులు డిమాండ్ చేస్తున్నారు.