నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం
అనంతపురం: రాయదుర్గం నియోజకవర్గంలో గత అర్థరాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గుమ్మగట్ట మండలం గోనబావిలోని బీసీ కాలనీలో మారెన్న ఇంటి దగ్గర కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో రెండు కొబ్బరి చెట్లు కాలిపోయాయి. భారీ ఉరుములు మెరుపులతో పిడుగు పడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాయదుర్గంలో గంటకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.