'​ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించాలి'

'​ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించాలి'

SRPT: సమాజంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని, ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని DMHO డాక్టర్ పెండెం వెంకట రమణ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బుధవారం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం అలవాటు చేసుకోవాలని, పొగాకు, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు.