ముగిసిన మోదీ, ఎయిర్ చీఫ్ మార్షర్ భేటీ

ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమన్ ప్రీత్ సింగ్ భేటీ ముగిసింది. ఈ సమావేశం సుమారు 40 నిమిషాలపాటు కొనసాగింది. భారత వైమానిక దళం సంసిద్ధత, ఆధునీకరణ, ఆపరేషన్ సామర్థ్యాలపై వారు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో వైమానికి దళం సవాళ్లు, భవిష్యత్తు వ్యూహాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం. పాక్‌పై భారత్ ఎప్పుడు దాడి చేస్తుందన్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.