'వర్షాలతో పంటలకు రక్షణ చర్యలు చేపట్టాలి'

'వర్షాలతో పంటలకు రక్షణ చర్యలు చేపట్టాలి'

MDK: చిలిపిచెడు మండలం ఫైజాబాద్‌లో పంటలను ఏవో రాజశేఖర్ గౌడ్ శనివారం పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రైతులు పాటించాల్సిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను చేశారు. వరి, పత్తి వంటి పంట పొలాల నుంచి నీరు నిలిచి ఉన్నట్లయితే, త్వరగా బయటకు పంపేందుకు మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.