VIDEO: 'వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి'
E.G: తుఫాన్ అనంతరం వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం కొవ్వూరు మండలం దొమ్మేరు పీహెచ్ సీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తుఫాన్ అనంతరం వైద్య సేవలు, నీటి నిల్వల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు.